వైసీపీ లో రగులుతున్న రాజధాని మంట.! రాజీనామా దిశగా మంత్రుల ఆలోచన ?

అమరావతి రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయం తీసుకుంటే అమ‌రావ‌తి ప్రాంతానికి చెందిన కొంద‌రు మంత్రులతో పాటు రాయ‌ల‌సీమ‌, కోస్తాకు చెందిన   నలుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పుడు సంచ‌ల‌న వార్త ఒక‌టి చ‌క్క‌రు్లు కొడుతోంది.  ఆ మంత్రులలో ఏయే జిల్లాలకు చెందిన వారన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కు  బయటకు పొక్కనప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేర‌కు  రాష్ట్రంలో రాజేసిన రాజ‌ధాని చిచ్చు త‌మ ప‌ద‌వుల‌కు నీళ్లు వ‌చ్చేలా చేస్తోంద‌ని, గ‌త కొంత కాలంగా స్పందించ‌కున్నా, ఇప్పుడు ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి గ‌త 15 రోజులుగా దీక్ష‌లు చేస్తున్నా ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో తాము పదవులకు రాజీనామా చేయక త‌ప్ప‌ని  పరిస్థితి కి తీసుకువ‌చ్చార‌న్న భావ‌న స‌న్ని

హితుల‌తో చ‌ర్చించుకున్న‌ట్టు తెలుస్తోంది. 
నిజంగాత‌మ రాజకీయ భవిష్యత్తు ప్ర‌ధాన‌మ‌నుకుని  ముఖ్యమంత్రి జగన్‌ను దిక్కరించి ధైర్యం చేసే మంత్రులు ఉన్నారా? అన్న‌ది సంశ‌య‌మే. ఏన్నో ఏళ్లు గ‌తించే… అధికారం కోసం ఉర్రూత‌ల్ అన్న చందంగా రాక‌రాక వ‌చ్చిన అధికారం నాలుగేళ్లు పైగా  ఉండ‌గా ఇప్ప‌టికిప్పుడు  అధికారాన్ని వదులుకునేందుకు ఎంత వ‌ర‌కు సిద్ద‌ప‌డ‌తార‌న్ని య‌క్ష ప్ర‌శ్నే. ఎందుకంటే అంద‌క అంద‌క అందిన అధికారం, దీనికి తోడు మీరు నాలుగు రెట్లు సంపాదించుకునేలా చూస్తానంటూ జ‌గ‌న్ ఇచ్చిన భ‌రోసా తో ఎంత మంది మంత్రులు బైట‌కు వస్తారన్న‌ది . 
ఇప్పటికే తుళ్లురు మండల ప్రాంతాల రైతులు మాత్రమే ఉద్యమాలు చేస్తున్నారు. ఆ పక్కనే ఉన్న మంగళగిరి తాటికొండ, ప్రాంతాల వారు   బయటకు రాలేద‌ని అంతా నుకున్నా ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంద‌న్న‌ది వాస్త‌వం. అందుకే పెయిడ్ ఆర్టిస్టులంటూ ఆందోళ‌న చెస్తున్న రైతుల‌పై ముద్ర వేసే ప్ర‌య‌త్నాన్ని ప‌దే ప‌దే ముద్ర వేస్తూ వ‌స్తున్న నేప‌ధ్యంలో , ఇదంతా తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియాతో పాటు ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయిస్తున్నారు .ఇదంతా కేవలం పధకం ప్రకారం జరుగుతుంది,మా మంత్రులు రాజీనామా చేయరు, అసలు ఆ ఆలోచనే వారికి రాదు అని గుంటూరు జిల్లాకు చెందిన చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే వైసిపి ఎమ్మెల్యే తనను కలిసిన వారితో చెబుతున్నారట.   

రాయలసీమలో  పరిస్థితులు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతున్నాయి.  నాలుగు జిల్లాలకు చెందిన అదికార పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు త‌మ క‌ర్నూలులోనే రాజ‌ధాని పెట్టాల‌ని కొంద‌రంటే… విశాఖ మాకు మ‌రీ దూరం, మ‌మ్మ‌ల్ని క‌ర్నాట‌క‌లో క‌లిపేయండ‌టంతూ అనంత శాస‌న‌స‌భ్యులు మాట్లాడ‌టం, ఒకింత వైసిపి అధిష్టానానికి అస‌హ‌నం క‌లిగించేదే.. 

అలాగే ఉత్త‌రాంధ్రాకు చెందిన స్పీక‌ర్‌తో స‌హా మంత్రులు విప‌క్షాల వైఖ‌రి త‌ప్పుప‌డుతూ రాజ‌ధాని విశాఖ వ‌స్తే అభివృద్ధి చెంది పోతామ‌ని చెప్పుతుండ‌ట‌మే విడ్డూరంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే గ‌తంలో వీరంతా ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్‌లో మంత్రులుగా చ‌లామ‌ణి అయిన వారే. వారి హ‌యాంలోనే ఆముదాల వ‌ల‌స సుగ‌ర్ మూత అయినా, గిరిసీమ‌ల్లో క‌న్నెధార కొండని అందుకునే ప్ర‌య‌త్న‌మైనా,  అణు విద్యుత్ కేంద్రం వ‌ద్ద‌ని అన్నందుకు రైతుల‌పై తూటాల పేల్చిందైనా… అన్న చేదు నిజాల‌ను దాచి పెట్టి… రాజ‌ధాని తాయిలాన్ని తీపి గుళిక‌లా తినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్న‌ది వాస్త‌వం.  
ప్ర‌భుత్వ ఏర్పాటు చేసుకున్న రెండు క‌మిటీలు జ‌గ‌న్ మ‌దిలోని భావాల‌నే నివేదిక‌ల రూపంలో ఇచ్చాయ‌న్న‌ది క‌నిపిస్తున్న అక్ష‌ర స‌త్యం. నివేదిక‌ల‌ వివరాలు, ప‌రిశీలిస్తే… రెండూ ఒకే గాటాన క‌ట్టిన క‌వ‌ల‌లుగా క‌నిపిస్తున్నాయి.   మరి ఈ నివేదిక‌ల ఆధారంగా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు  కార్యరూపం దాల్చుతాయ‌న్న మాట వైసిపి వ‌ర్గాల‌లో వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసిపిలో రేగుతున్న అసంతృప్తి ఎటువైపుకుత‌ర‌లుతుంద‌న్న‌ది మరి కొంత కాలం వేచిచూడాల్సిందే.  

Leave a Reply

Your email address will not be published.