‘కోబ్రా’ షూటింగ్ నీ అడ్డుకున్న కరోనా

 

త‌మిళ వైవిధ్య న‌టుడు  విక్రమ్  ‘కోబ్రా’  చిత్రం శ‌ర‌వేగంగా నిర్మాణం అంతుంటే కారోనా వైర‌స్ కాస్త బ్రేకులేసిన‌ట్టు క‌నిపిస్తోంది.  7 స్క్రీన్ స్టూడియో లలిత్ కుమార్, వయాకామ్ 18 స్టూడియోలు సంయుక్తంగా నిర్మిస్త‌న్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముతు దర్శకత్వం వహిస్తున్నాడు. 

 ప్ర‌స్తుతం  రష్యాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా  కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా,  షూటింగ్ మ‌ధ్య‌లోనే విర‌మించి తిరిగి వ‌స్తోంది. . ఈ విషయాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు అజయ్ జ్ఞానముత్తు ట్వీట్ చేశారు, “భారత ప్రభుత్వం విసాల‌పై తీసుకున్న‌ నిషేధ నిబంధనల కారణంగా రష్యాలో   కోబ్రా  చిత్రాన్ని ఆపేసి వెన‌క్కి వ‌స్తున్నామ‌ని  త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ చిత్రంలో న‌టుడిగా తమిళ అరంగేట్రం చేస్తుండ‌గా, కెజిఎఫ్‌లో నటించిన శ్రీనిధి శెట్టి  క‌థానాయిక‌. అలాగే దర్శకుడు కె.ఎస్.రవికుమార్, మిర్నాలిని రవి   ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు . ఎట్టి ప‌రిస్థితిలోనూ మేలో విడుదల చేస్తామ‌ని చెపుతున్న చిత్ర యూనిట్ ఈ చిత్రం కోసం హైద‌రాబాద్ ఫిల్మ్ స్టూడియోకి షిఫ్ట‌య్యే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది. 

 

Leave a Reply

Your email address will not be published.