అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై ‘కాశ్మీర్ ఫైల్స్’

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కాశ్మీర్ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ‘కాశ్మీర్ ఫైల్స్’. చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్లో సంచలన దర్శకుడుగా ‘ది తాష్కెంట్ ఫైల్స్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకుడు.
ఆర్టికల్ 370 చుట్టూ అల్లిన కథతో ఈ చారిత్రాత్మక సినిమా నిర్మిస్తున్నామని, అసలు కాశ్మీర్ కోసం ఆర్టికల్ 370 ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? దీనివెనుక ఉన్న కారణాలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానంగా మా ‘కాశ్మీర్ ఫైల్స్’ ఉండబోతోందని అన్నారు దర్శకుడువివేక్ రంజన్ అగ్నిహోత్రి.
హైదరాబాద్ వచ్చేసిన ఆయన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ తో కలసి దర్శించుకుని కాసేపు సినిమా గురించి మీడియాలో మాట్లాడారు. ఈ చరిత్రలో భాగమైన ఎంతోమంది లెజెండ్స్ పాత్రల్లో ప్రముఖ నటులు నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, పాత్రలకు తగిన రూపం, వచ్ఛస్సు ఉన్న వారిని ఎంపిక చేసి నిర్మాణం ఆరంభించినట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవానికి చిత్రాన్ని విడుదల చేసేలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్టు చెప్పారు.