అప్పుడు బాబాయ్‌తో ఇప్పుడు అబ్బాయితోఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్లు ఒకే ఫ్యామిలీ నుంచి వ‌చ్చే హీరోల‌కి ఒకే హీరోయిన్ చెయ్య‌డం ఫ్యాష‌న్ అయిపోయింది. ఇటు అన్న‌తో అటు  తమ్ముడుతో అలాగే బాబాయ్‌తో అబ్బాయితో, మేన‌మామ‌తో, మేన‌ల్లుడుతో ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల‌తో హీరోయిన్లు ఇద్ద‌రికీ ఒకే హీరోయిన్ చెయ్య‌డం చాలా కామ‌న్ అయిపోయింది.  అదే విధంగా ఇప్పుడు… న‌టాషా దోషీ బాల‌య్య జై సింహా సినిమాలో అమ్మ కుట్టి అమ్మ కుట్టి సాంగ్‌లో చేసింది..  ఆ సాంగ్ కోసం ఆమెను ప్ర‌త్యేకంగా తీసుకున్నారు. 

ఆ సాంగ్‌లో బాల‌య్య‌, న‌టాషా దోషి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.. బాల‌య్య స్టెప్పులు సూప‌ర్‌.. ఇప్పుడు  క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తున్న `ఎంత మంచివాడవురా` సినిమాలో ఐటెం సాంగులో చేసింది… ఇప్పుడు ఈ సినిమాలో చేసింది. అప్పుడు బాబాయ్‌తో క‌లిసి స్పెప్టులేస్తే ఇప్పుడు అబ్బాయితో క‌లిసి స్పెప్పులేసింది. మ‌రి బాబాయ్‌కి ఓకే ఆ చిత్రం బాగానే హిట్ అయింది.  మ‌రి ఈ భామ అబ్బ‌యికి క‌లిసొస్తుందా. క‌ళ్యాణ్‌రామ్ చిత్రం హిట్ అవుద్దా ఈమె ఎంత వ‌ర‌కు క‌ళ్యాణ్‌రామ్‌కి క‌లిసొస్తుంది అని కొంత మంది ఫ్యాన్స్ అంటున్నారు. 

ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు క్లీన్ ‘U’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎలాంటి అసభ్యకరమైన సీన్ లేకండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉందని చెబుతున్నారు. ‘శతమానం భవతి’ సినిమా తర్వాత సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి పోటీలో చివరగా జవనరి 15న  విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘ఎంత మంచివాడవురా’ పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మించారు. అయితే శ‌త‌మానం భ‌వ‌తి చిన్న సినిమాగా మొద‌లై పెద్ద హిట్ ని సాధించింది. మ‌రి ఈ చిత్రం కూడా అదే కోవ‌లో హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. 


Leave a Reply

Your email address will not be published.