ఏపీ రాజకీయ పరిణామాలను సినిమాల్లో పంచ్ డైలాగ్లుగా

ఏపీ రాజకీయ పరిణామాలను సినిమాల్లో పంచ్‎ల రూపంలో ఓ రకంగా వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హాట్ టాపిక్ ఇప్పుడు మూడు రాజధానుల చర్చ. ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చాడు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి నోటా ఏపీ రాజకీయాల మాట..మూడు రాజధానుల ముచ్చట. తాజాగా ఇదే టాపిక్ పై సీఎం జగన్ కు గట్టి పంచ్ వేశారు నటి షకీలా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం’.
ఈ చిత్రానికి వి.ఎన్ సతీష్ దర్శకత్వం వహించారు. ఆదివారం నాడు ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. షకీలా పేపర్ చదువుతూ.. ‘ఆంధ్రాకి మూడు రాజధానులు’ అని పేపర్‌లో రాసిన వార్తను చదివి షకీలా ఆశ్చర్యపోవడంతో టీజర్ మొదలైంది. ‘ఆంధ్రాకి మూడు రాజధానులేంటి?’ అని తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తుంది. ఇందుకు ఆ వ్యక్తి స్పందిస్తూ.. ‘అవును మేడమ్. జగన్ అన్న మూడు రాజధానులు చేసేశాడుగా’ అంటాడు. ఇందుకు షకీలా.. ‘ఒక్క స్టేట్‌కే మూడు రాజధానులా? పోను పోను ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్యపోనవసరం లేదు’ అని పంచ్ వేశారు. ఈ సినిమాలో విక్రాంత్; పల్లవి ఘోష్ జంటగా నటించారు. 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై సతీష్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published.