సిక్కోలు డిసిసిబి పీఠంపై పాల‌వ‌ల‌స‌శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా నియమితులైన పాలవలస విక్రాంత్ ప్రమాణస్వీకారం గురువారం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.  
 ఈ కార్య‌క్ర‌మానికి ఆంధ్ర ప్రదేశ్ రోడ్లు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ,రాజాం నియెజకవర్గ గౌరవ శాసనసభ్యులు కంబాల జోగులు , పాలకొండ శాసన సభ్యురాలు విశ్వసరాయి కళావతి పాల్గొని అభినందనలు తెలిపారు.   పాలవలస కుటుంబ సభ్యులు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.
కాగా పాల‌వ‌ల‌స విక్రాంత్ తండ్రి పాల‌వ‌ల‌స రాజ‌శేఖ‌రం కూడా డిసిసిబి అధ్య‌క్షుడిగాప‌నిచేయ‌టం విశేషం. ఇప్ప‌టికే విక్రాంత్ సోద‌రి పాత‌ప‌ట్నం శాస‌న‌స‌భ్య‌రాలిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.