తెనాలి కామెడీ మ‌రీ ఇంత ఔట్ డేటెడా…?
వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో మంచి పేరును సొంతం చేసుకున్నారు జి.నాగేశ్వరరెడ్డి. ఆయన సినిమా అంటే నవ్వులకు లోటుండదనే నమ్మకాన్ని సంపాదించుకున్నారు. 6టీన్స్, సీమశాస్త్రి, దేనికైనారెడీతో పాటు పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారాయన. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏబీఎల్. ఈ నెల 15న ఈచిత్రం విడుదలయింది. మ‌రి ఈ చిత్రం చాలా అద్భుత‌మైన కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని సినిమాకి వెళితే ప‌ప్పులో కాలేసిన‌ట్లే. సినిమా ప్రేక్ష‌కుడు ఊహించినంత వినోదాత్మ‌కంగా ఉండ‌దు. కొన్ని సీన్ల‌లో అయితే న‌వ్వాలా వ‌ద్దా అన్న‌ట్లు బ‌ల‌వంతంగా న‌వ్వాల్సి వ‌స్తుంది. కొన్ని కొన్ని స‌న్నివేశాల్లో లాజిక్ లేకుండా తీసిన‌ట్లు ఉంది.


  మ‌రి కామెడీ చిత్రాలు క‌రువైన ఈ రోజుల్లో న‌వ్వుకుదూర‌మ‌వుతున్నాం కాబ‌ట్టి రెండు గంట‌ల సేపు ఎంతో ఆనందంగా న‌వ్వుకోనేలా ఈ సినిమాని చిత్రీక‌రించాం అన్నాడు ద‌ర్శ‌కుడు. కానీ చాలా చోట్ల ప్రేక్ష‌కుడు బోర్ ఫీల‌వుతాడు. అలాగే సందీప్ కిష‌న్ గ‌తంలో చేసిన నిను వీడ‌ని నీడ‌ను నేనులో క‌న్నా కామెడీ చాలా త‌క్కువ‌గా ఉంద‌ని భావిస్తున్నారు మ‌రికొంద‌రు. అన్న‌పూర్ణ‌, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ లాంటి అద్భుత‌మైన యాక్ట‌ర్స్‌ని పెట్టి కూడా ఎవ్వ‌రికీ స‌రైన యాక్టింగ్ స్కోప్ ఇవ్వ‌లేద‌నిపించింది.


ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల‌కి మారు పేరు వ‌రల‌క్ష్మి  ఇందులో నెగిటివ్ పాత్ర‌లో క‌నిపించినా ఆమెకి కూడా స‌రైన డైలాగులుకాని, ఆఖ‌రిలో త‌న యాక్టింగ్ ప‌వ‌ర్ చూపించే స్కోప్ ఎక్క‌డా సినిమాలో క‌నిపించ‌లేద‌నిపించింది. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే కొంచం ఎక్క‌వ చెయ్య‌డం వ‌ల్ల‌నో ఏమోగాని ఒక్క క‌ల‌ర్ త‌ప్ప ఫేస్ లో గ్లో లేదు. అంతేకాక సినిమా మ‌ధ్య మ‌ధ్య‌లో కొన్ని డ‌బుల్ మీనింగ్ డైలాగులు ప్ర‌స్తుతం ప్ర‌తి సినిమాలో ఇదొక ఫ్యాష‌న్ అయిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగుల‌తోనో, డ‌బుల్ మీనింగ్ ప‌నుల‌తోనో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కి వ‌స్తారు అన్న‌ది చాలా త‌ప్పు. ప్ర‌తి ప్రేక్ష‌కుడు క‌థ‌ను చూస్తున్నాడు. క‌థ న‌చ్చితేనే సినిమాకి వ‌స్తున్నారు. మ‌రి రానున్న సినిమాల‌కైన‌ ద‌ర్శ‌కుల ఆలోచ‌నా విధానం మారుతుందో లేదో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.