తెలివైన ఎంపికలు .. తెలివిగా చక్కబెట్టేస్తోంది!

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నాజూకు సుందరి రకుల్ ప్రీత్ సింగ్ జెట్ స్పీడ్తో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. అయితే నాన్నకు ప్రేమతో, స్పైడర్, సరైనోడు, బ్రూస్ లీ, దృవ, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ.. ఆరు పాటలు , నాలుగు సీన్స్‌పై పరిమితం అయ్యింది తప్ప హీరోయిన్గా తనను తాను నిరూపించుకునే పాత్రలైతే చేయలేకపోయింది.
అయినప్పటికీ అవకాశాలు మాత్రం ఈ హీరోయిన్ తలుపు తడుతూనే ఉన్నాయి. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలను సైతం చుట్టొచ్చింది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోయిన్ రేంజ్ రావడంతో భారీగా రెమ్యునరేషన్ రాబడుతోంది. అయితే ఇటీవల కాలంలో తెలుగులో విన్నర్, స్పైడర్ లాంటి భారీ డిజాస్టర్లు రావడంతో పాటు.. కొత్తగా వచ్చిన కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్, పూజా హెగ్డేల నుండి విపరీతమైన పోటీ ఉండటంతో రకుల్ ప్రీత్ సింగ్ రేంజ్ తగ్గింది. యంగ్ హీరో నితిన్ త్వరలో వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రం జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఖరారైంది. వెంకీ కుడుముల చిత్రం తరువాత నితిన్ నటించబోయే చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత రూపొందించ బోతున్నారట. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబోలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామలో అవకాశం దక్కించుకుంది. అలాగే హీరో కార్తీ సరసన దేవ్ చిత్రంలో నటిస్తోం.

Leave a Reply

Your email address will not be published.