అభిమాని చివరి కోరిక

ఆటపాటలతో.. చదువుసంధ్యలతో గొప్పగా ఎదగాల్సిన ఓ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. అరుదైన లివర్ క్షయ వ్యాధి కబలిస్తోంది. ఈ వ్యాధి నయం అవ్వాలంటే రూ.30లక్షలు ఖర్చవుతుందని ముంబై- కెమ్ (కె.ఇ.ఎం) ఆస్పత్రి డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు డీలా పడిపోయారు. ఇక తమ కుమార్తె బతకడం కష్టమేనన్న భయంతోనే బతుకు ఈడుస్తున్నారు. అయినా తన తండ్రి డ్రైవర్ షేక్ సలీమ్ హుస్సేన్ చేయని ప్రయత్నమే లేదు. కూతురిని బతికించుకునేందుకు నిధిని సేకరిస్తున్నాడు. ప్రఖ్యాత కెట్టో వెబ్ సైట్ ద్వారా ఆపన్నహస్తం కోసం ప్రయత్నిస్తే ఇప్పటికి రూ.30 వేల వరకూ కలెక్టయ్యింది. అయితే రూ.30లక్షల మేర సాయం రావాలంటే అది అంత సులువేం కాదు.
ఆ క్రమంలోనే ప్రాణంపై ఆశ వదులుకున్నారు. సదరు చిన్నారి సమ్మయ షేక్ తన ఫేవరెట్ స్టార్ శ్రద్ధా కపూర్ ని కలుసుకోవడమే తన చివరి కోరిక అని చెప్పింది. ఈ సంగతిని జనవరి 25న సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఆ సంగతి తెలుసుకున్న శ్రద్ధ తన అభిమానిని కలిసేందుకు కెమ్ కార్పొరెట్ ఆస్పత్రికి వెళుతున్నారు. ప్రస్తుతం ఆ తండ్రి తనకు ఉన్నదంతా ఊడ్చిపెట్టి వైద్యం చేయిస్తున్నాడు. సాహో బ్యూటీ శ్రద్ధా తనవంతు సాయం అందిస్తుందనే అందరూ ఆశిస్తున్నారు. అభిమానిని కలిసేందుకు శ్రద్ధ ఇప్పటికే తన అనుయాయులకు చెప్పారట. 13 ఏళ్ల చిన్నారి బతుకు చిద్రం కాకుండా శ్రద్ధ తనవంతు ఏం సాయం చేస్తుందో. శ్రద్ధ కపూర్ ప్రస్తుతం సాహో చిత్రంలో నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.