‘కనులు కనులను దోచాయంటే’ సక్సెస్ మీట్

 
దేసింగ్‌ పెరియసామి దర్శకుడు. నిర్మాణ సంస్థలు వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా త‌మిళంలో నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’ చిత్రాన్ని తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ పేరుతో ఈ చిత్రాన్ని ‘కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ కమలాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డితో కలిసి డా. రవికిరణ్   ఫిబ్రవరి 28న విడుదల చేసారు.  ప్రేమ‌క‌థా చిత్రంగా హిట్ టాక్ తెచ్చుకుంది.  ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. 

ఈ సంద‌ర్భంగా  దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ ‘‘ ఇది ఓటీటీ, డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో  కాకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది.  ఈ సినిమాకు థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ వేరు.   దర్శకుడు దేసింగ్‌ పెరియసామి హార్డ్‌ వర్క్‌కి రిజల్ట్‌ ఈ సినిమా. మాకు ఈ విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని అన్నారు.

రీతూ వర్మ మాట్లాడుతూ ‘‘ చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి సినిమాతో ఇక్క‌డ‌కి  రావడం సంతోషంగా ఉంది.  కంటెంట్‌ బావుంటే తెలుగు ప్రేక్షకులు సినిమాను హిట్‌ చేస్తారని ‘కనులు కనులను దోచాయంటే’ మరోసారి నిరూపించింది.  ’’ అని అన్నారు.

 ఈ కార్యక్రమంలో డా. రవికిరణ్ , అనిష్‌ కురువిల్ల . రక్షణ్ , నిరంజని, భాస్కరన్‌ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published.