తప్పని తేలితే చెప్పుతో కొట్టించుకుంటా…
ఎస్ వి బి సి మాజీ చైర్మన్ పృథ్వి కేసులో అదిరిపోయే ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి ఎలాంటి ఫిర్యాదు లేకుండా విచారణ చేయాల్సి రావడం, ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వంటి తాజా పరిణామాలతో పృద్వి చెప్పినట్లుగా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆడియోటేప్ లో మాట్లాడిన మహిళ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడం కూడాఅనేక అనుమానాలకు తావిస్తోంది, నిజంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారా లేక  సరస సంభాషణ బయటపడటంతో లైంగిక వేధింపులు చేస్తున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 
రాసలీలల సంభాషణ ఆడియో బయటికి రావడంతో ఇప్పటికే తన పరువు పోయిందని సదరు మహిళ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు ఇప్పటికే  అల్లరిపాలు అయ్యానని  మీడియా ముందుకు వస్తే ఇంకా తన పరువు పోతుందని బాధితురాలు ముందుకు రావటం లేదు. ఆరోపణలు నిరూపణ కానిదే నిందితులపై చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని విజిలెన్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.  కానీ పృథ్వి తనపై పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిన కుట్రగా వివరిస్తున్నారు,  ఎస్విబిసి చైర్మన్ గట్టిగా మాట్లాడకూడదు అని తన గొంతు నొక్కే సారు అని అన్నారు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లక్షలు దోచుకున్నట్లు నిరూపించినా  మద్యం తాగిన దేవుడు శిక్షిస్తాడని పృద్వి అన్నారు టీటీడీ లో అన్యమత ప్రచారాన్ని ఖండిస్తునే ఉన్నానన్నారు. తనది తప్పని తేలితే చెప్పుతో కొట్టించుకుంటాను అని పృథ్వి తీవ్ర వ్యాఖ్యలు చేశారు,తాను జగన్ మోహనరెడ్డి, వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డికి దగ్గరవుతున్ననని తనపై కుట్రపన్నారన్నారు, తనను రాజీనామా చెయ్యమని అధిష్టానం కోరలేదని విచారణ కోసం తానే  రాజీనామా చేస్తున్నానని చెప్పారు,  విచారణ అనంతరం మళ్లీ బాధ్యతలు చేపడతానని పృధ్విరాజ్ తెలియజేసారు.  

Leave a Reply

Your email address will not be published.