నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ప్రముఖ చలన చిత్ర నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.మారుతీరావు 1939, ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు.రచయితగా అనేక చిత్రాలకు పనిచేసిన ఆయన చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో నటుడిగా తెరంగ్రేటం చేశారు.అంతకు ముందు నాటకాలు, నవలలు, కథలు కూడా రచించారు.విజయవాడ ఆకాశవాణి కేంద్రంలోనూ పనిచేశారు.మారుతీరావుకు మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు.అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.