త‌లైవా ప‌క్క‌న కీర్తి కాదా?


హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా వరసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు త‌లైవా. పేట మన దగ్గర పోయింది కానీ తమిళనాడులో వంద కోట్ల వసూళ్లు రాబట్టి చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కోరుకున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. పాత రూపంలో రజని స్టైల్ ని దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఆవిష్కరించిన తీరుకు వసూళ్ల వర్షం కురిసింది. ఇదిలా ఉండగా దీని తర్వాత రజని మురుగదాస్ కు ఓకే చెప్పిన సంగతి తెల్సిందే.

ప్రస్తుతం స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు దాస్. తొలుత హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకుంటారనే టాక్ చాలా బలంగా చెన్నై మీడియాలో వినిపించింది. సర్కార్ టైంలో కీర్తి పనితనం నచ్చిన దాస్ ఈ ఆఫర్ తనకే ఇచ్చార‌ని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణ‌యం మారేలా ఉంది. గతంలో కాలా ఆడియో ఫంక్షన్ లో ఇకపై తాను కూతురి వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేయనని చెప్పిన విష‌యం తెలిసిందే. దానికి తగ్గట్టే 2.0 పేటలలో టూ యంగ్ బ్యూటీస్ అవసరం పడలేదు.

ఇప్పుడు కీర్తి సురేష్ తో చేస్తే కనక ఆ అమ్మాయి రజని ఇద్దరు కూతుళ్ళ కంటే చాలా చిన్న వయసుది. తనతో కలిసి డ్యూయెట్స్ చేస్తే విమర్శలు వచ్చి పడతాయి. మాట తప్పుతారా అంటూ కామెంట్ల దాడి చేస్తారు. అందుకే నయనతారను తీసుకునే ఆలోచనలో ఉందట టీమ్. మురుగదాస్ తో గజినీ రజనీకాంత్ తో చంద్రముఖి చేసిన నయన్ అయితే ఎలాంటి ట్రాలింగ్ కు అవకాశం ఉండదు. పైగా తను సీనియర్ హీరోయిన్. ఈ కోణంలో ఆలోచించే ఇలా చేస్తున్నారని తెలిసింది. అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చు.

Leave a Reply

Your email address will not be published.