నాగ్ కోసం గెస్ట్ పాత్రకైన సై
టాలీవుడ్ ‘మన్మథుడు’ అక్కినేని నాగార్జున సరసన అనుష్క జతకట్టనుంది. కెరీర్ మొదట్లో ఎక్కువ గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యతనిచ్చిన అనుష్క ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు ఎక్కువగా చేస్తూ వస్తోంది. త్వరలో కోన వెంకట్ నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది.
అయితే ‘సూపర్’ చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఈ భామ ఆ చిత్రంలో నాగార్జున సరసన కథానాయికగా నటించింది. అందులో అనుష్కకి మంచి పేరు వచ్చింది. తర్వాత కూడా నాగ్ సరసన పలు సినిమాలలో నటించింది. తనని ఎంతగానో ప్రోత్సహించిన నాగ్‌పై ఉన్న అభిమానం కారణంగానే ఆయన సినిమాలలో గెస్ట్ పాత్రలకైన సై అంటుంది.
ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున త్వరలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రం చేయనున్నారు. ఇందులో కథానాయికగా పాయల్ రాజ్‌పుత్ నటించనుండగా, ముఖ్య పాత్రలో అనుష్కని ఎంపిక చేసినట్టు టాక్. మరి దీనిపై క్లారిటీ రావాల్సివుంది.