సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు గారికి నివలర్పిస్తున్న మోహన్‌బాబు

సినీ క్రిటిక్స్ పసుపులేటి రామారావు గారి మృతి పట్ల సినీ పరిశ్రమ నివాళులర్పిస్తోంది. ఈ క్రమంలోనే నటుడు, నిర్మాత మోహన్‌బాబు ఓ ప్రకటన విడుదల చేస్తూ… “నాకు అత్యంత సన్నిహితుడైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను నటుడిగా వెండితెకు వచ్చిన ప్పటి నుంచి ఆయనతో పరిచయం స్నేహంగా మరింది. మేం మద్రాసులో ఉన్నా, హైదరాబాద్ కు వచ్చాక కూడా అదే సానిహిత్యం కొనసాగించుకున్నాం. తెల్లటి దుస్తులు, భుజాన కాటన్ సంచీ.. ఆది నుంచి ఆయన ఆహార్యం. జర్నలిజంలో నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఆయన. సినిమా జర్నలిస్టుగా చిత్రసీమకు ఆయనెంతో సేవచేశారు. ఒక తరం సినీ జర్నలిస్టులకు మార్గదర్శిగా నిలిచిన ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను “అని ప్రకటనలో పేర్కొన్నారు.