వెబ్‌సిరీస్‌తో గ‌ట్టెక్కాల‌నుకుంటున్న‌కుమారి


హెబ్బా పటేల్… ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. దీంతో యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది హెబ్బాకు. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైన, వాటిని దైర్యంగా ఎదుర్కోంటూ ముందుకెల్తుంది. హెబ్బా పటేల్ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా వుంటుంది.  ఈ అమ్మడికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. దాంతో కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ తో ఓ సినిమాలో నటిస్తున్న హెబ్బా పటేల్ కు పెద్దగా అవకాశాలు రావడం లేదు . రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా కీల‌క‌మైన పాత్ర‌లో ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రంతో యూత్‌కి ద‌గ్గ‌రైన హీరోయిన్ హెబ్బాప‌టేల్ న‌టిస్తున్నారు. ఇటీవల ‘24 కిస్సెస్‌’ చిత్రంలో నటించింది. తన బోల్డ్‌ యాక్టింగ్‌తో ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసేందుకు రాబోతోంది. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘రాడికల్‌’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిన్న‌ది నితిన్‌కి జోడీగా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భీష్మ్ చిత్రంలో నితిన్‌తో జ‌త‌క‌ట్ట‌నుంద‌ని పాత్ర నిడివి త‌క్కువే అయిన‌ప్ప‌టికీ అభిన‌యానికి ఆస్కారం ఉన్న పాత్ర కాబ‌ట్టి ఆ చిత్రంలో న‌టించ‌డానికి హెబ్బా ఒప్పుకుంది. ఈ పాత్ర కోసం హెబ్బా ప్ర‌త్యేకంగా బ‌రువు త‌గ్గింద‌ట‌. ప్ర‌స్తుతం ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్న‌ట్లు తెలిసింది. పూర్తి స్థాయి హీరోయిన్ పాత్ర‌ల‌కు దూర‌మైన హెబ్బాకి ప్ర‌స్తుతం ఎలాగైన అవ‌కాశాలు త‌గ్గాయ‌నే చెప్పాలి.

దాంతో వెబ్ సిరీస్ లలో చేయడానికి రెడీ అయింది. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పిందట. ప్రస్తుతం డిజిటల్ మీడియా హంగామా బాగా ఉంది కాబట్టి పలువురు స్టార్స్ ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో హెబ్బా పటేల్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. నవదీప్, హెబ్బా పటేల్ నటించే ఈ సిరీస్ కు అజయ్ భుయాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా షూటింగ్ కూడా మొదలైంది. మరి ఈ వెబ్ సిరీస్ తో హెబ్బా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.