కాలువ లో పడిన కారు. తనయుడి ప్రాణాలు కాపాడిన తల్లి

ప్రమాదవశాత్తు కనేకల్ చెరువు సమీపంలోని హెచ్ఎల్సీ కాలువలోకి శుక్రవారము కారు అదుపుతప్పి పడింది ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కొండూరు గ్రామానికి చెందిన జయలక్ష్మి ఈ మధ్యనే కొనుగోలుచేసిన తమ సొంత కారులో తన కుమారునితో పాటు కనేకల్ క్రాసింగ్ కి ప్రయానంమయ్యారు కనేకల్ క్రాసింగ్ లో ఆర్డిటి పాఠశాల నందు ఆమె కుమార్తె చదువుతుంది, కుమార్తెను స్వగ్రామానికి తీసుకు వెళ్ళేందుకు బయలుదేరాయారు మార్గమధ్యలోహెచ్ ఎల్ సి కాలు వపై ప్రయాణం సాగిస్తుండగా కొంతదూరంలో ద్విచక్ర వాహనం వస్తుండటాన్ని గమనించిన జయలక్ష్మి కుమారుడు వేణు కారును పక్కకు తిప్పే ప్రయత్నం చేశాడు కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది కారు కున్న డోరు అద్దాలు ముందస్తుగానే తెరుచుకుని ఉండటం వలన జయలక్ష్మి తన తో పాటు కుమారుడు వేణు ను కూడా కాలువ గట్టు కు ఎంతో ధైర్యం సాహసంతో లాక్కుని వచ్చి రక్షించాలని అటుగా వెళ్తున్న వాహనదారులు కోరారు వెంటనే ఒక వ్యక్తి వచ్చి వల సాయంతో ఇద్దరిని బయటికి లాగారు తృటిలో ప్రాణాపాయం తప్పడంతో జయలక్ష్మి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి పోలీసుల సహాయంతో కారును వెలుపలకు తీశారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.