వెంకీమామ‌లో చైతూ పాత్ర‌

బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవల రాజమండ్రి లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో వెంకీ , చైతూ ఫై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈచిత్రానికి సంబందించిన వీడియో లీక్ కావడంతో షూటింగ్ స్పాట్ లో సెక్యూరిటీ పెంచారట. ఇక ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్లర్ ఓనర్ గా నటిస్తుండగా చైతూ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నార‌ట. పక్కా కామెడీ ఎంటర్‌టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ , రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దసరా కానుకగా ఈచిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.