సంక్రాంతి పుంజులు రె ‘ ఢీ ‘

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత పది రోజులు ముందుగానే కోడి పందాలు నిర్వాహణకు  సన్నాహాలు చేశారు. ఇందుకుగాను తెరవెనుక కొందరు బడా నేతలు వీటిని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందాలను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. . తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేలా ప్రతీ ఏటా కోడి పందాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పందెంరాయిళ్ళు  గోదావరి జిల్లాలకు చేరుకున్నారు , సంప్రదాయం పేరుతో కోళ్లకు కత్తులు కట్టకుండా పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు పైకి పోలీసులకు చెబుతున్నాఇది అమలులో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఇప్పటికే పందెం రాయిళ్ళు కత్తులను కట్టే వారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. పందాలను అడ్డుకోవడం ఎవరి తరం కాదని వారుధీమాతో ఉన్నారు, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రాజకీయ నేతల ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది , ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ టెంట్లు వేసి మరీ కోడి పందాలు నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పేరెన్నికగన్న ప్రాంతాలుగా మంచి గుర్తింపు పొందాయి. ఇతర రాష్ట్రాల నుండి సైతం ఈ పందాలకు తరలిరావడం ఏటా సర్వసాధారణమైంది. పండుగ మూడు రోజుల్లోనూ కోట్లాది రూపాయల మేర చేతులు మారుతుంటాయి. ఈ ఏడాది కొందరు ప్రజాపత్రినిధులు దగ్గర ఉండి బహిరంగంగానే కోడి పందాలను నిర్వహించేలా చర్యలు చేపట్టారు. కొందరు ప్రజాప్రతినిధులైతే తమ పేరు మాత్రం బయటకు రాకుండా గోప్యత పాటిస్తూ కోడి పందాలకు భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా తోటల్లో నిర్వహించే కోడి పందాలకు సకల ఏర్పాట్లు చేసినా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.