ఉన్న ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నెగిటివ్‌గా మారింది

తెలంగాణలో వైద్యుల చొర‌వ‌తో ఉన్న ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నెగిటివ్‌గా మారింద‌ని, దీంతో క‌రోనా కేసులు రాష్ట్రంలో లేకుండా పోయాయ‌ని చెప్పారు ఆరోగ్య‌ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. బుధ‌వారం ఆయ‌న మీడియాలో మాట్లాడ‌తూ  ఇటీవ‌ల‌ దుబాయి నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్‌ ఉద్యోగికి అన్ని విధాల వైద్య స‌హాయం అందించాక రెండు సార్లు కరోనా టెస్టులు నిర్వహించగా   నెగిటివ్‌ వచ్చిందని, త్వరలోనే ఆత‌న్ని డిశ్చార్జ్  చేస్తామని చెప్పారు.

 కరోనా సోకితే చని పోతారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం వాస్త‌వం కాద‌ని,  త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోని వారిలో   3 శాతం మాత్రమే న‌ట్టు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కేసులు ప‌రిశీలిస్తే అర్ధ‌మ‌వుతోంద‌ని అన్నారు.  కరోనా  కోమంటూ ప్రత్యేకంగా మందులు లేవని ఇప్పటికి  పరిశోధనలు మాత్ర‌మే  జరుగుతున్నాయని   త్వరలోనే మందులు.. వాక్సిన్‌ లు వ‌చ్చే ఆస్కారం ఉంద‌ని  ఆశిస్తున్నామ‌న్నారు. 

  ఉస్మానియా లో టెస్టులు జరుగుతుండ‌గా  కాకతీయ మెడికల్‌ కాలేజి, ఐపీఎం, ఫీవర్‌ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులకు అనుమతి ల‌భించింద‌ని, త్వ‌ర‌లో వీటిని ఆరంభిస్తామ‌ని చెప్పారు. హైద‌రాబాద్ వ‌స్తున్న వారిని ఎయిర్‌పోర్టులో 47,611 మందికి కరోనా స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించారమ‌ని చెప్పారు.   వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నవారు 549 మంది ఉండగా.. ఇప్పటి వరకూ గాంధీలో 268 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 264 మందికి కరోనా నెగెటివ్‌ రాగా.. 21 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు మంత్రి ఈటెల‌.
 

Leave a Reply

Your email address will not be published.