పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే

 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  రీఎంట్రీ  దాదాపు ఖ‌రారైన నేప‌థ్యంలో  ప‌వ‌న్ స‌ర‌స‌న‌ పూజా హెగ్డే నటించబోతుందని ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తున్న మాట‌.  ‘పింక్’ రీమేక్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నప‌వ‌న్ ఈసినిమాకు సంబంధించి ప‌లు మార్పులు చేర్పుల‌పై ఇప్ప‌టికే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.   ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చిన్నదే అయినా  పాత్ర ప్రాధాన్యత చాలా ఉండ‌టంతో పూజ హెగ్డే అయితే ఆ పాత్రకు బాగుంటుందని, ప‌వ‌న్‌తో పూజా జోడీ కొత్త‌గా ఉంటుంద‌ని ఆమెను  సంప్రదించారట చిత్ర నిర్మాతలు.క‌థ విన్న పూజా కూడా గ్రీన్ సిగ్న‌లిచ్చింద‌ని స‌మాచారం. 
దిల్ రాజు, బోనికపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  కాగా మ‌రోవైపు ఇప్పటికే తమన్ సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి న‌ట్టు ఫిలింన‌గ‌ర్ జ‌నాలు చెపుతున్న మాట‌.


Leave a Reply

Your email address will not be published.