సమంత పోలికలతో మరొక అమ్మాయి

మ‌న భై ప్ర‌పంచంలో  మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. అంతెందుకు .రికార్డు డాన్సుల‌లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ , శోభ‌న్ బాబు  చిరంజీవి, బాల‌కృష్ణ , జూనియర్ ఎన్టీఆర్  పోలికలతో డాన్స్‌లు చేస్తూ ఆక‌ట్టుకున్న ఆర్టిస్టులు చాలా మంది మ‌న‌కి క‌నిపిస్తారు.  అయితే హీరోయిన్ పోలికలతో ఉండే అమ్మాయిలు క‌నిపించ‌డం చాలా అరుదు. 
 “ఏ మాయ చేసావే” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట‌రై సిని ప్ర‌పంచాన్ని త‌న‌దైన‌ మాయ చేసి, వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న‌ సమంత పోలికలతో ఉన్నభామ అశు రెడ్డి సామాజిక మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆ రూప‌మే ఆమెను బిగ్ బాస్ సీజన్ లోకి న‌డిపించి, బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని మైమ‌రిపించింది,   రాత్రికి రాత్రే బిగ్‌బాస్ దెబ్బ‌కి సోషల్ మీడియా సెలబ్రిటీ గా మారిపోయిన అస్మిక  కొన్ని సినిమాలు కూడా చేసింది.
ఇప్ప‌డు మరొక అమ్మాయి ఆత్మిక  సమంత పోలికలతోనే సామాజిక మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. త‌న   తన ఫోటో షూట్ లు   సోషల్ మీడియాలో చేసిన పోస్టుల‌కు నెటిజ‌న్లు మైమ‌రిచి పోతున్నారు.  ఇంస్టాగ్రామ్ లో ఇప్పటికే ఆమెకు 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.  ఓ  హీరోయిన్  లాగే ఆమె ఉండటంతో ప‌లువురు నిర్మాత‌లు వెతుక్కుంటూ వ‌స్తున్నార‌ట‌.   ఆశు రెడ్డి లాగే ఆత్మిక  కూడా సినిమా ఛాన్స్ లు కొట్టేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published.