భారీగా ప‌డిపోయిన వెండి ధ‌ర‌లు.. బంగారం మాత్రం..


రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచింది. కానీ వెండి మాత్రం భారీగా ప‌తన‌మైంది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 39,170 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా 35,910 రూపాయల వద్ద ఉంది. అయితే, వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీకి 750 రూపాయలు తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,650 వద్దకు చేరింది.
ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 37,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,700 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 750 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 46,650 రూపాయల వద్దకు చేరింది

Leave a Reply

Your email address will not be published.