వాలెంటైన్స్ వీక్

ఫిబ్రవరి అనేది లవర్స్ మంత్ అని చాలా మంది అంటారు. ఎందుకంటే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను జంటగా జరుపుకునేందుకు, చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి మూడు రోజుల‌లో ప్రేమికుల రోజు వ‌చ్చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ర‌స్ప‌రం త‌మ ప్రేమికుల‌కు బ‌హుమ‌తులు అందించేందుకు, గ‌త జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకునేందుకు అప్పుడే సిద్ద‌మైపోతున్నారు…

మనది కులాలు, మతాలు, సంప్రదాయాల‌కు పెట్టింది పేరుగా ఉన్న మ‌న‌దేశంలో పురాణ కాలం నుంచి, అంత‌కు మించి యుగ‌యుగాలుగా ప్రేమ‌లు ఉన్నాయి.. పెళ్లిళ్లూ ఉన్నాయి. ప్రియురాలిని లేపుకు పోయిన పురాణ పురుషులూ ఉన్నారు. త‌మ ప్రేమ‌నుద‌క్కించుకునేందుకు యుద్ధాలు చేసిన వారూ ఉన్నారు. తండ్రుల మాట ప‌క్క‌కు పెట్టి ప్రియురాలి కోసం ప‌రిత‌పించి, కొడుకుల చేతిలో జైళ్ల బారిన ప‌డిన వారు మ‌న‌కు ఈ దేశ చ‌రిత్ర‌లో చాలా మంది క‌నిపిస్తారు.రాధాకృష్ణులు, శివ‌పార్వ‌తులు, శ‌కుంత‌ల‌- దుష్యంతులు, భీముడు – హిడింబి, లైలా – మ‌జ్నూ, షాజ‌హాన్‌- ముంతాజ్ ఇలా చ‌రిత్ర‌లో నిల‌చిన ప్రేమికులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారి ప్రేమ‌క‌థ‌లెన్నెన్నో నేటి త‌రానికి స్పూర్తిదాయ‌కాలే అన‌టంలో సందేహం లేదు. 

ప్రేమ అనే ప‌దం ఇత‌ర దేశాల మాదిరిగా కాకుండా స్వ‌చ్చ‌త‌కు నిలువుట‌ద్దంగా నిల‌చేలా ఒక తాజ్‌మ‌హ‌ల్‌, మినీ తాజ్‌మ‌హాల్‌, మ‌న భాగ్య‌న‌గ‌రం నిర్మాణాలే ఇందుకు ప్ర‌ధాన సాక్ష్యాలు. ప్రేమ మాటున నిర్మిత‌మైనవి ఇప్పుడు కులం మ‌తం భాషా బేధాలు లేకుండా ప్రేమ‌ను పంచుతునే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published.