అన్నయ్య కోసం వస్తున్న యంగ్ టైగర్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న హైదరాబాద్‌లో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలుస్తోంది. ‘ఎన్టీఆర్ – బాలయ్య’ ఒకే వేదిక పై చూడాలని నందమూరి ఫ్యాన్స్ చాలీ ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. ఇక ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. మరి ఆర్ ఆర్ ఆర్ బిజీలో ఉన్న ఎన్టీఆర్ అన్నయ్య కోసం రాజమౌళిని పర్మిషన్ అడిగి మరి వస్తున్నాడంటే గ్రేట్ అనే చెప్పాలి. ఓ పక్క ఆ చిత్ర బిజీలో ఉంటూ ఈ ఈవెంట్ కోసం రావడం అంటే మాములు విషయం కాదు. ఇక మరి బాబాయ్ అబ్బాయిలు ఇద్దరూ ఈ వేదికని సందడి చేయనున్నారని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి నిరాశే మిగిలింది. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను బట్టి ఆయన ఉండే బిజీ వల్ల బాలయ్య ఈ ఈవెంట్‌కి రాలేకపోతున్నారు. అందుకు అన్నయ్య కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు.