హ‌నీకి దిల్‌రాజు పై కోపం ఎందుకో ?

హనీ ఈజ్ ద బెస్ట్.. ఈ డైలాగ్ వినగానే వెంటనే ఎఫ్-2 సినిమా అందులోని మెహరీన్ క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది కదా. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలుసిందే.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం ఇప్పటికీ భారీ టాక్‌తో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఈ చిత్రం భారీ విజయం తరువాత ఎఫ్‌-3 సినిమా కూడా తీయాలన్న నిర్ణయానికి వచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి , నిర్మాత దిల్ రాజు.. ఎఫ్‌-2లో నటించిన తారాగణాన్నే తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారట దిల్ రాజు. అయితే ఎఫ్‌-2 సినిమాలో ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్‌ను ఎఫ్‌-3కి అడుగుతున్నారట.
అందరూ ఒక ఎత్తయితే ఇందులో మెహరీన్ కాస్త ఎక్కువగా రెమ్యునరేషన్ అడుగుతోందట. దీనికి దిల్ రాజు ఒప్పుకోవడం లేదట. దీంతో మెహరీన్‌కు కోపం వచ్చి అడిగిన డబ్బులు ఇస్తేనే ఎఫ్‌-3లో నటిస్తానని తేల్చి చెబుతోందట. 

Leave a Reply

Your email address will not be published.