ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే టీఆర్ఎస్ గెలుపు: మాజీమంత్రి దామోదర్‌రెడ్డి

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే టీఆర్ఎస్ పార్టీ గెలిచిందే తప్ప ప్రజాబలంతో కాదని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాకూటమి గెలుపు ఖాయమని అన్ని సర్వేలలో తెలినప్పటికీ కేసీఆర్ మాత్రం టీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. ప్రజాకూటమి ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 30 వేల ఓట్లు ట్యాంపరింగ్ జరిగినట్లు తెలుస్తుందన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ ఓడినప్పటికి నైతికంగా ప్రజల మద్దతుతో గెలిచామన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఓడిదుడుకులను, ఓటమి, గెలుపులను చూశానని ఏనాడూ అధైర్య పడలేదన్నారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చకొని ముందుకెళ్తామన్నారు. ప్రతి కార్యకర్త రాబోయే గ్రామపంచాయతీ, మున్సిపాలటి, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. అసెంబ్లీకి పోనప్పటికి ప్రజా సమస్యలపై పోరాటం మాత్రం ఆపమన్నారు.
కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తండు శ్రీనివాస్‌యాదవ్, నాయకులు కొప్పుల వేణారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు, చకిలం రాజేశ్వర్‌రావు, అంగిరేకుల నాగార్జున, అబ్ధుల్ రహీం, బైరు వెంకన్నగౌడ్, డీసీసీబీ డైరక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి, గోపగాని వెంకటనారాయణగౌడ్, ఎడ్ల వీరమల్లుయాదవ్, జడ్పీటీసీ పిన్నాని కోటేశ్వర్రావు, కుమ్మరికుంట్ల వేణు, వాసుదేవరావు, వీరన్ననాయక్, బెల్లంకొండ శ్రీరాములు, జానకిరాంరెడ్డి, షఫిఉల్లా, షాహిన్‌బేగం అంజద్‌అలీ, చెంచల శ్రీను, గోగుల రమేష్, వల్థాస్ దేవేందర్, వెలుగు సంతోషివెంకన్న, బత్తుల రమేష్, బొల్లె జానయ్య, చిలుముల సునిల్‌రెడ్డి, సాజిద్‌ఖాన్, ఈద ప్రవీణ్, గుంటి సైదులు, ఆలేటి మాణిక్యం పాల్గొన్నారు.