షూటింగ్ కోసం లండన్‌కు వెళ్లి తిరిగొచ్చిన బెంగాలీ నటి

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. భారత్‌లో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా సోకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి ఇటీవల బాజి షూటింగ్ కోసం లండన్‌కు వెళ్లిన ఇండియా చేరుకుని, . కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకున్నారు. అయినా, ముందస్తు జాగ్రత్తలలో భాగంగా ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటానని, ప్రభుత్వం గడువు విధించినన్ని రోజుల పాటు ఎవరిని కలవకూడదని నిర్ణయం తీసుకున్నాని తన సామాజిక మీడియా ఖాతాలో ఆమె వివరించారు.
ఇంట్లో ఉన్నా నన్ను కలవద్దని నా తల్లిదండ్రులకు చెప్పానని, ఇది మనకి చాలా కష్ట కాలం పరిస్థితి ఏక్షణాన ఎలా మారుతుందో తెలియదు. శుభ్రత, చేతులు కడుక్కోవడం వంటి చర్యలు అంతా పాటించాలని, ఇతరులతో దూరంగా మెలగాలి’ అని అందరినీ కోరారామె.