బహిరంగ చర్చకు సిద్దమేనా?

కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అమిత్ షాను కలవాలంటూ ఢిల్లీ చుట్టూ ఎందుకు చెక్కర్లు కొడుతున్నారో చెప్పాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ నిలదీసారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… క్రిమినల్ మైండ్‌తో నిత్యం ఆలోచించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను చేసిన అవినీతి మీద బహిరంగ చర్చకు వచ్చేందుకు సిద్దమేనా? అని ప్రశ్నించారు. టైం మీరు చెపుతారా? మమ్మల్ని చెప్పమంటారా?, ప్లేస్ మీరు డిసైడ్ చేస్తారా? మమ్మల్ని డిసైడ్ చేయమంటారా? అని ఆమె సవాల్ విసిరారు.
. 87% వైకాపా నేతల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారి మీద ఉన్న అవినీతి కేసులన్నాయని ఇతరుల మీద కూడా అవినీతి మరకలు రుద్దే ప్రయత్నం వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటీవల .జరిగిన ఐటీ దాడుల్లో రూ.2వేల కోట్లు దొరికాయని అవినీతి పుత్రిక సాక్షి పత్రిక రాసిన కథనం పట్టుకుని వైకాపా నాయకులు తెగ డప్పులు కొట్టుకుంటున్నారని, జగన్ అవినీతితో వైసిపిలోని వ్యక్తులందరికీ భాగముందన్నట్టే వాళ్ల మాటలు బట్టి అర్ధం చేసుకోవాలా? అని ఎద్దేవా చేసారు. బురద జల్లే ప్రయత్నాలకు పేటెంట్ వైసిపి తీసుకుందని, 38 వారాల నుంచి జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా ఏదో కుంటి సాకులు చెపుతోందని సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఎందుకు స్పందించదన్నారు. తను తప్పు చేయలేదనుకుంటే, పదే పదే ఈ వాయిదాలెందుకని, ఇదే నాకష్టార్జితం అని ఆధారాలతో కోర్టుకు అఫిడవిట్ ఇవ్వరెందుకని నిలదీసారామె.
జగన్ మోహన్ రెడ్డి తండ్రిగారైన రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని చూసాడని, ఆతనిపై 26 ఎంక్వైరీలు వేసారు. చివరికి ఆ నివేదికలను కట్టగట్టి దాచేసుకుని, ఏం చేయలేకపోయారని గుర్తు చేసారు. జగన్ కు దమ్ముంటే చంద్రబాబులా ఏటా తన ఆస్తులను ప్రకటించాలని సవాల్ చేసారు.