‘ఆరుద్ర’ చిత్రం తెలుగులో

ప్రముఖ నటుడు కె.భాగ్యరాజా కీలక పాత్ర లో తమిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రచయిత,  నటుడు, దర్శకనిర్మాతగా వెలుగొందుతున్న  పా.విజయ్  దర్శకత్వం రూపొందుతున్న తాజా చిత్రం ‘ఆరుద్ర’.   మేఘాలీ, దక్షిత , సోని, సంజన సింగ్‌ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంల ప్రధాన పాత్రలో పా.విజయ్ నటించడం విశేషం.   సామాజిక ఇతివృత్తంతో తమిళంలో రూపొందిన ఆరుద్ర’.అక్ంక‌డ  విడుదలై విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని అదే పేరుతో జె.ఎల్‌.కె. ఎంటర్‌ ప్రైజెస్‌ అధినేత కె.వాసుదేవరావు తెలుగులోకి అనువదిస్తున్నారు.  
ఇటీవ‌లే  సెన్సార్ పూర్తి చేసుకుని  క్లీన్‌ యు సర్టిఫికెట్‌ అందుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్న సంద‌ర్భంగా  త్ర నిర్మాత కె.వాసుదేవరావు మీడియాతో  మాట్లాడుతూ ‘‘తమిళంలో తొలిసారిగా  పిల్లలకు , పేరెంట్స్‌కు మ‌ధ్య ఉండాల్సిన సంబంధాలను , మంచి చెడుల‌ను   అందరికీ అర్థమయ్యేలా  లవ్‌, కామెడీ మరియు ఎమోషన్స్ ల‌తో చూపించారు.  తమిళంలో  క్రిటిక్స్‌తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని మంచి వసూళ్లు రాబట్టింది. యూనివర్సల్‌ కాన్సెప్ట్‌ కాబట్టి తెలుగులోకి అనువదిస్తున్నాం.  పా.విజయ్‌ దర్శకత్వంలో నిన్న, నేడు, రేపు, దిశ, నిర్భయ, సంఘటన తరహాలో మహిళలకు, ఆడ పిల్లలకు జరుగుతున్న అమానుష చర్యలకు ప్రతీకార దిశగా ఈ చిత్రం ఉంటుంది అని చెప్పారు. మానవ మృగాలకు సింహ స్వప్నం. గా ఈ సినిమా ఉంటుంద‌ని,   ఆడ పిల్లలకు మహిళలకు అభయ హస్తం అందిస్తూ, వారిని అంతమొందించడమే ఈ చిత్రం కథ. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
 

Leave a Reply

Your email address will not be published.