క‌మ్మ‌రాజ్యం విడుద‌ల కోసం మ‌ళ్లీ హైకోర్టుకు వ‌ర్మ‌

రాంగోపాల్ వర్మ త‌న‌ ‘కమ్మ రాజ్యం’ సినిమా కు సెన్సార్ స‌ర్టిఫికేట్ వ‌చ్చేసింద‌ని ఇక విడుదలే త‌రువాయంటూ 12న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అయితే రేపు ధియేట‌ర్ల ముంగిట‌కు రావాల్సి ఉన్న ఈ చిత్ర‌ విడుద‌ల జ‌రిగే మార్గం క‌నిపించ‌డంలేదు. ఇప్ప‌టికే కేఏ పాల్ వేసిన కేసులో హైకోర్టు సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కావాలని కోరింది. కానీ సెన్సార్ బోర్డు వర్మ సినిమాకు ఇప్పటికే సర్టిఫికెట్ ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. 
అయితే వ‌ర్మ చెప్పిన‌ట్టు సెన్సారోళ్లు స‌ర్టిఫికెట్ ఇష్యూ చేయ‌లేద‌ట‌. ఇందుకోసం వైసిపికి చెందిన కొంద‌రి నేత‌ల‌తో క‌ల‌సి రివైజ్ క‌మిటీ ముందుకు వెళ్లినా వాళ్లు చేసిన అభ్యంత‌రాల‌తో సినిమా పేరును ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ మార్చి12 సీన్లను కట్ చేశాడు.కట్స్ తర్వాత సెన్సార్ బోర్డు కరుణించే అవ‌కాశాలు క‌నిపించ‌డంలేద‌న్న‌ది ఫిలింన‌గ‌ర్ టాక్‌. ఎట్టిప‌రిస్థితిలోనూ సినిమా విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నవ‌ర్మ‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఫలితాలు రాక పోవ‌టంతో అధికార పార్టీకి చెందిన ఓ పెద్ద‌త‌ల‌కాయ సూచ‌న‌ మేరకు హైకోర్టులో పిటీషన్ వేశాడు. సినిమాను రేపు విడుదల చేస్తామని..అనుమ‌తులు మంజూరు చేయాల‌ని అభ్య‌ర్ధించాడు.
ఈ నేప‌థ్యంలో ‘కమ్మ రాజ్యంలో’ సినిమా రేపు విడుదల అవుతుందా లేదా అన్న డోలాయ‌మాన ప‌రిస్థితి లో ఉన్నాడు వ‌ర్మ‌. మ‌రి కోర్టేం చెపుతుందో చూడా

Leave a Reply

Your email address will not be published.