రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వెంకీ మామ’

వెంకటేశ్ – నాగచైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే చిత్రం తెరకెక్కింది.వినోదాత్మక కుటుంబకథా చిత్రంగా ఆద్యంతం అలరించే కథా కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా .. వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ ఫుత్ నటించారు.తమన్ సంగీతాన్ని సమకూర్చారు.ఈచిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికేచిత్రం నుండి విడుదలైన లిరికల్ సాంగ్స్ టీజర్,ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.రేపటి నుండి థియేటర్స్ లో చిత్రం సందడి చేయనుంది.అభిమానులు ఆసక్తిగా ఈచిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.