వైసీపీ కి కేంద్రం ఇచ్చిన షాక్….
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తు అభివృద్ధి వికేంద్రీకరణ మాటు శాసనసభలో బిల్లులు తీసుకువచ్చింది. వీటికి కేబినేట్, అసెంబ్లీ ఆమోదం తెలిపినా.. మండలి మాత్రం ఆమోదించకుండా సెలక్ఠ్ కమిటీకి పంపాలని నిర్ణయించడంతో వీటి వైపు మరి మూడు నెలల వరకు చూడాల్సిన పనే ఉండదని రాజకీయ వర్గాలు ఓవైపు చెపుతుంటే మరోవైపు కేంద్ర మంత్రి మండలి సమావేశమై కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న డయ్యూ డామన్ – దాద్రా నగర్ హవేలీలకు డామన్‌ను రాజధానిగా నిర్ణయించడం ఏపికి షాక్ ఇచ్చినట్టేనని మరికొందరు చెపుతున్నారు.
అసలు రాష్ట్రాల రాజధానుల వ్యవహారంలో కేంద్ర జోక్యమే ఉండదంటూ వాదిస్తూ వచ్చిన జీవిఎల్ సైతం కేంద్ర మంత్రి వర్గ నిర్ణయంతో అవాక్కయ్యారని తెలుస్తోంది. రాజధానుల అభివృద్ధి, ఇతర అంశాలలో కేంద్ర నిధులు, విధాన పరమైన నిర్ణయాలున్నందున సంబంధం ఉంటుందంటూ కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న ఈ రాజధానుల కీలక నిర్ణయం విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియా కు తెలియజేసారు.
మూడు రాజధానులకు కేంద్రం మద్దతు వుందంటూ ఓవైపు వైసీపీ ప్రచారం చేసుకుంటున్న క్రమంలో కేంద్రం నిర్ణయం ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో చర్చించారని, త్వరలో ప్రధాని ఏపీకి కూడా అమలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తారన్న వార్తలు ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.