‘డర్టీ హరి‘ ఫస్ట్ లుక్స్ విడుద‌ల….


వెండి తెర‌పై ఎన్నో స‌క్స‌స్ చిత్రాలందించిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న “డర్టీ హరి”. హైద‌రాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డి హీరోగా ప‌రిచయం అవుతున్న ఈ సినిమా సిమ్రత్ కౌర్ , రుహాణి శర్మ హీరోయిన్లు. ఇప్ప‌టికే విడుద‌లైన ‘డర్టీ హరి‘ ఫస్ట్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. 
శ‌ర‌వేగంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన రీ-రికార్డింగ్ పనులు మంగ‌ళ‌వారం నుంచి మొదలయినట్టు చిత్ర నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ లు తెలిపారు. .

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నఈ రొమాంటిక్ ధ్రిల్ల‌ర్ ఆక‌ట్టుకునే ఉంద‌ని అన్నారు. సున్నితమైన భావోద్వేగభరితమైన సన్నివేశాలు చాలా ఉన్నాయ‌ని, ఎంఎస్ రాజుగారు అనుభ‌వంతో ఇవి తెర‌పై మ‌రింత అందంగా క‌నిపిస్తాయ‌ని చెప్పారు. నిర్మాణాంతర కార్యక్రమాలని పూర్తి చేసుకుని త్వరలోనే చిత్ర టీజర్ విడుద‌ల చేస్తామ‌ని, రిలీజ్ డేట్ కోసం ప‌లు అంశాలు ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని చ‌ర్చిస్తున్నామ‌ని త్వ‌ర‌లో ప్రకటిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ద‌ర్వ‌కుడు ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ, 1987 లో తన మొదటి సినిమాకి కే.వి. మహదేవన్ ప‌నిచేస్తే ఆపై రాజ్ కోటి, కొత్త తరం సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, మణిశర్మ, చక్రి, కార్తీక్ రాజు ఇలా అంద‌రితో ప‌నిచేసిన అనుభ‌వం తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మార్క్ కే రాబిన్లు గుర్తు చేస్తున్నార‌ని త‌న జ్ఞాప‌కాల‌ను నెమరువేసుకున్నారాయ‌న‌.

Leave a Reply

Your email address will not be published.