మేం దాడి చేస్తే మీరు ప‌రారే- వివాదంలో సోమ‌శేఖ‌ర‌రెడ్డి
దేశ వ్యాప్తంగా కర్ణాటకలో సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జ‌రుగుతుంటే…  మైనారిటీలు జాగ్రత్తగా ఉండకుంటే దాడులు చేస్తామంటూ క‌ర్నాట‌క‌కు చెందిన  బిజెపి ఎమ్మెల్యే జి సోమశేఖర రెడ్డి తీవ్ర పదజాలంతో చేసిన హెచ్చరిక‌లు ఇప్పుడు వివాద‌మ‌వుతున్నాయి.  ఈ దేశంలో  మైనారిటీలు 17 శాతమేనని వారంతా  తాము చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని లేకుంటే దేశంలో ఉన్న 80 శాతం  మంది హిందువులు  దాడి చేస్తే మీ గతి ఏమవుతుందో ఊహించుకోండంటూ చేసిన ప్ర‌క‌ట‌న సామాజిక మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.


 మైనింగ్‌ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న బిజెపి మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి కి సోమశేఖర రెడ్డి స్వయాన అన్న కావ‌టం విశేషం.  కాగా సోమ‌శేఖ‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాల‌తో పాటు అధికార ప‌క్ష నేత‌లు కూడా మండి ప‌డుతున్నారు. శాంతికాముకంగా ఉన్న ఈ దేశంలో ఇప్ప‌టికే మ‌తం, కులం చిచ్చులు రేగుతున్నాయ‌ని, బాధ్య‌తాయుత ప‌ద‌విలో ఉండి ఇలా మాట్లాడ‌టం త‌గ‌ని ద‌ని కాంగ్రెస్ మండి పడింద‌. మ‌రో వైపు క‌ర్నాట‌కకు చెందిన కొంద‌రు సోమ‌శేఖ‌ర్ వ్యాఖ్య‌ల‌పై కోర్టును ఆశ్ర‌యించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published.