మహేష్ ప్లాన్స్ అదరహో… ఇంతకీ వర్క్ అవుట్ అవుద్దా?
పోటీ ఎక్కువగా ఉండటంతో మహేష్ సినిమా ప్రచారంలో కొంచెం దూకుడు పెంచాడు. జనవరి మొదటి వారంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చెయ్యాలని, దీనికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ ను పిలవాలనే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. కానీ సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ సినిమా కూడా ఉండటంతో అన్నను కాదని మహేష్ సినిమా గురించి ఎన్టీఆర్ వస్తాడో రాడో అని ఫిలింనగర్ వర్గాలు గుస గుసలాడుకుంటున్నాయి.
కానీ మహేష్ బాబు పిలిస్తే ఎన్టీఆర్ కాదనడని, గతంలో కూడా మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ మహేష్ ని పొగడ్తలతో ముంచేసిన సంగతి తెలిసిందే. ఇక మరి ఎవరికి ఓటేస్తాడో తారక్ చూడాలి. ఇదలా ఉంటే మహేష్ గత చిత్రం ప్రీరిలీజ్‌కి ఎన్టీఆర్ గెస్ట్‌గా వచ్చాడు కాబట్టి ఈ సారి చరణ్ వైపు ఆయన చూసులు వెళుతున్నాయి అని మరో పక్క వార్తలు వస్తున్నాయి. మరి ఏది నిజమవుతదో చూడాలి. ఇకపోతే ఏది ఏమైనప్పటికీ ఈ కుర్ర హీరోలు మాత్రం ఎప్పుడూ ఒకరికొ మరొకరు సపోర్ట చేసుకుంటూ బాగానే ఉంటున్నారు.