నిబంధ‌న‌లు తుంగ‌తొక్కి… టిటిడి స‌భ్యుడి వ్య‌క్తిగ‌త యాగం…?

టిటిడిలో బోర్డు స‌భ్య‌డంటే తామేదో ఈ దేశానికి అధ్య‌క్షుడున‌ని భావిస్తున్న‌ట్టుంది ప్ర‌స్తుత జంబో బోర్డు స‌భ్యులు. వాస్త‌వానికి తిరుమ‌లో కానీ, తిరుపతి లో కానీ ఆల‌యాల‌లో, దేవ దేవీర‌ల‌కు  చేసే సేవ‌లు, హోమాలు మిన‌హా  మిన‌హా వ్యక్తిగత హోమాలు పూర్తిగా నిషేధం. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఆన‌వాయితీగా వ‌స్తోంది. కానీ ఇక్క‌డ ఉన్న స‌భ్యుల‌ది రివ‌ర్స్ విధానం క‌దా… అందుకే వారు కూడా ఆ బాట‌లోనే న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. తితిదే నిబంధ‌న‌ల‌ను కాదుని రహస్యం గాకపిల తీర్థంలోని గుడిలో ఒక టీటీడీ బోర్డు సభ్యుడు త‌న అత్తా మామల షష్ఠిపూర్తి సందర్భం గా రుద్ర హోమ జపం జరిపించారంటూ వార్తలు గుప్పుమన‌టంతో  తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరుపై, పోకడలపై  మండి ప‌డుతున్నారు భ‌క్త‌గ‌ణం.

వివ‌రాల‌లోకి వెళితే టీటీడీ బోర్డు సభ్యుడు కృష్ణమూర్తి వైద్యనాథన్  తన అత్తా మామల షష్టిపూర్తి సందర్భంగా   అరవై మంది ఋత్విక్కులతో రహస్య యాగాన్ని నిర్వహించారు. కపిలతీర్థంలోని ఆంజనేయ స్వామి మందిరం ముందు జరిగిన ఈ యాగానికి  టీటీడీ బోర్డు సభ్యుడు, ఆయన కుటుంబ సభ్యులు హాజ‌ర‌య్యారు.  భక్తులతో సహా, ఎవరినీ యాగస్థలానికి అనుమతించలేదు. పైటీ టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఈ యాగస్థానాన్ని కాపలా కాయ‌టం మ‌రో విడ్డూరం. ఈ యాగం దీనికి అనుమతి ఎవరిచ్చారన్నది భ‌క్తులు నిల‌దీసినా యాగ‌స్ధ‌లికి పంప‌బోమ‌ని సెక్యూరిటీ స‌సేమిరా అన్నారు.

Leave a Reply

Your email address will not be published.