గోడ మీద వార్తలు

గోడ మీద వార్తలు
15 – 01 – 2019

01 తెలంగాణలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 19 నుండి మూడు రోజుల మద్యం దుకాణాల బంద్ …

రేయ్ – గిదేదో ఘనకార్యమనుకుని సంకలు గుద్దు కునేరు – స్టాకు ముందే తెచ్చిపెట్టుకొమ్మని హింటిస్తన్నరంతే …!!

02. ఢిల్లీతో పాటూ దేశంలో 102 నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని వెంటనే అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకి సూచించిన – జాతీయ హరిత ట్రిబ్యునల్ …

ముందర ఆ డిజిల్ ఆటోలనీ – ఆర్టీసీ బస్సులని సంపూర్ణంగా ఎలక్ట్రిక్ వాహనాలతో ఎక్స్ఛేంజి చేస్తే సగం దరిద్రం వదిలినట్టే…!!

03. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు – షర్మిలక్క …

మరేం – నాలుగున్నరేళ్ళుగా అన్నియ్య యాత్రకి అంతకు ముందు నీ యాత్రకీ కాపలా కాసినందుకు ఆళ్ళకామాత్రం కితాబివ్వాల్సిందే అక్క…!!

04. ఉభయగోదివరీ కృష్ణా జిల్లాల్లో జోరుగా కోడి పందాలు – తొలిరోజు కలెక్షన్లు 100 కోట్లని టాకు …

బాహుబలి కన్నా ఈ కోడి బలి కలెక్షన్లే బాగున్నాయ్ – లైసెన్సిచ్చి టాక్సులేస్తే సంచులతో సొమ్ములొస్తాయ్ ప్రభుత్వాలకి…!!

05. బెజవాడ దుర్గమ్మ గుడి సన్నిధిలో తలసాని రాజకీయల గురించి మాట్లాడటాన్ని తప్పు బట్టిన – ఆలయ సిబ్బంది …

అసలు దేవాలయాల్లో రాజకీయ ప్రశ్నలేసిన మీడియాకి ముందు మక్కెలిరగ్గొడితే సగం మంది రాజకీయనాయకులకి బుద్దొస్తాది…!!

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!

Leave a Reply

Your email address will not be published.