సొంత పార్టీ నేతలే రేవంత్ కి పొగబెడుతున్నారా..?

తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డి ఇటీవల భూ ఆక్రమణ వివాదంలో చిక్కుకోవటం , తప్పుడు పత్రాలతో ఆయన తన సోదరుడితో కలసి భూముల కొనటం తదితర ఆరోపణల పరంపరపై ఇప్పటికే అధికారులు విచారణ ఆరంభించిన తరుణంలో గోపన్ పల్లి లో రేవంత్ కబ్జాలపై నేడో రేపో అరెస్టయ్యే ఆస్కారం కనిపిస్తోందని సొంత పార్టీ నేతలే చెపుతున్న మాట.
కాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షపదవి కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న రేవంత్‌ని కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపాలని కొందరు భావిస్తున్నారని, ఆ క్రమంలోనే కొందరు సీనియర్లు రేవంత్ వ్యవహారంపై అనేక ఫిర్యాదులు అధిష్టానంకు చేసినట్టు సమాచారం అందుతోంది. పార్టీ కోసం ఎన్నోఏళ్ల నుంచి కష్టపడుతున్న నేతలను కాదని తెలంగాణా కాంగ్రెస్ ని ముందుకి నడిపించేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అందలం అందుకున్న రేవంత్ తన సొంత ఇలాకాలోనే ఓటమి చవిచూసాడని, మల్కజ్గిరి పార్లమెంటు స్థానంలో రేవంత్ తన బలంకన్నా, సీమాంధ్ర ఓటర్ల బలంతోనే నెగ్గిన విషయాన్ని గుర్తుకు తెస్తున్నారు వీరంతా.
ఇది పక్కన పెడితే రేవంత్ రెడ్డి ని ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసే యోచనలో ఉందని అంటున్నారు. రాష్ట్రంలో కీలక నేతలు కొందరు ఆయనపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రేవంత్ వ్యాపారాల కోసం ఆలోచించే మనిషి అని ఆయన వలన పార్టీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి అదే విధంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల మీద ఇప్పటికే అధిష్టానం అసహనంగా ఉంది.
భూ కబ్జా ఆరోపణలతో రేవంత్ రెడ్డి పార్టీని అభాసుపాలు చేసారని, ఇలాంటి తరుణంలో ఆయన కు పిసిసి కట్టబెడితే ఉన్న పరువు కాస్త పోతుందని, పార్టీకి సీనియర్లు వివరించారట. రేవంత్‌కు వ్యతిరేకంగా సీనియర్లు ఇచ్చిన నివేదికలపై కాంగ్రెస్ అగ్ర నేతలు కూడా అసహనం వ్యక్తం చేసారని, కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.