మ‌హిళ‌ను చంపి మెద‌డును వండుకున్నాడా…?


మ‌నుషులు మాన‌వ‌త్వాన్ని మ‌ర్చిపోయి మృగాల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. బ‌హుశా మృగాలు కూడా ఇంత అరాచ‌కంగా ఉండ‌వేమో అనిపిస్తుంది. ఈ ఘ‌ట‌న గురించి వింటే. ఫిలిప్పీన్‌లోని బరంగాయ్ పుంతా ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన సంచలనంగా మారింది. రోడ్డు పక్కన తలలేని మహిళ శవం పడివుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె తల కోసం పరిసర ప్రాంతాల్లో వెతికారు. కానీ, ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె శవం పడివున్న ప్రాంతానికి సమీపంలో ఇళ్లకు వెళ్లి.. ఆ మహిళ ఆచూకీ క‌నుక్కునేందుకు ప్రయత్నించారు. అప్పుడే ఓ ఘోర నిజాన్ని తెలుసుకున్నారు పోలీసులు.

రోడ్డు పక్కనే పడివున్న ఆ మహిళ మృతదేహం అర్థనగ్నంగా ఉంది. శరీరంపై కేవలం డెనీమ్ జీన్స్ ఫ్యాంట్ మాత్రమే ఉంది. స్థానికులు కూడా ఆమెను గుర్తుప‌ట్ట‌లేదు. ఎవ్వ‌రూ తెలియ‌దు అని చెప్ప‌డంతో పోలీసులు ఇక వాళ్ళ జాగిలాల‌ను రంగంలోకి దించారు.  దీంతో అవి ఘటనా స్థలానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాయిడ్ బాగ్టాంగ్ (21) అనే యువకుడి ఇంటి వద్దకు వెళ్లి ఆగాయి. ఆ సమయంలో ఆ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో పోలీసులు పొరిగింటివారిని ఆరా తీయగా.. అతడు కంగారుగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం చూశామని చెప్పారు. దీంతో పోలీసుల‌కి అతడి పై అనుమానాలు మొద‌ల‌య్యాయి.

పోలీసులు బాగ్టాంగ్ కోసం బరంగాయ్ మొత్తం జల్లెడపట్టారు. చివరికి అరెస్టు చేశారు. ఆ హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. అయితే ఈ సంఘ‌ట‌న‌కి ఎందుకు పాల్ప‌డ్డాడో అడిగితే అందులో  భయానకమైన నిజాలు చెప్పాడు. హత్య చేసిన యువతి ఎవరో తనకు తెలియదన్నాడు. ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె నాతో ఇంగ్లీషులో మాట్లాడింది. నాకు ఆ భాషంటే కంపరం. అందుకే ఆమెను చంపేశాను. గార్డెన్‌లోని కత్తెరతో శరీరం నుంచి తలను వేరు చేశాను. ఆ సమయంలో నాకు బాగా ఆకలి వేసింది. దీంతో ఆమె మెదడును తీసి అన్నంతో కలిపి వండుకుని తినేశా. పుర్రెను ఓ గోతిలోకి విసిరేశాను’’ అని తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌ వింటుంటే ఇలాంటి ఘోర‌మైన మ‌నుషులు కూడా  స‌మాజంలో ఉంటారా అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.