అమరావతి: వైసీసీ ప్రభుత్వంపై ఆ పార్టీ కార్యకర్తలే భిన్నస్వరం వినిపించారు

అమరావతి: వైఎస్ కుమారుడని ముఖ్యమంత్రి జగన్కు ఓట్లేసి మోసపోయామని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 3 రాజధానుల అంశానికి వ్యతిరేకంగా వెలగపూడిలో నిర్వహిస్తున్నరిలే నిరాహారదీక్షలో వారంతా పాల్గొన్నారు. నమ్మించి మోసం చేయడం సీఎం జగన్కు తగదని విమర్శించారు. మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని సూచించారు. తమ భూముల్లో కట్టిన భవనాల్లో ఎందుకు ప్రమాణస్వీకారం చేశారని కార్యకర్తలు ప్రశ్నించారు. రాజధాని మారదని హామీ ఇచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు. ప్రభుత్వ ప్రకటనతో తాము కూడా దిక్కుతోచని స్థితిలో పడ్డామని వాపోయారు.