విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న “సూసైడ్ క్లబ్”.

మజిలీ సినిమా ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి,సాకేత్,వెంకట కృష్ణ,చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం “సూసైడ్ క్లబ్”. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 3 i ఫిలిమ్స్ సమర్పణలో ప్రవీణ్ ప్రభు వెంకటేశం నిర్మిస్తున్నారు. నిర్మాణంత‌ర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న ఈ సినిమా ట్రైలర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ. “సూసైడ్ క్లబ్” ట్రైలర్ మేకింగ్, సినిమాటోగ్రఫీ, కటింగ్ చాలా స్టైయిలిష్ గా ఉన్నాయి. కొత్త జనరేషన్ ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తున్నందుకు. అంద‌రికీ అభినంద‌న‌లు. చిత్ర‌ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ చాలా బాగా రూపొందించాడ‌నిపించింది. యూనిట్‌కి అల్ ది బెస్ట్ అని చెప్పారు.
ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ బొగడపాటి రాంగోపాల్ వర్మ కు కృతజ్ఞతలు తెలుపుతూ… మా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.