కూతురి సంసారానికె ఎసరు పెట్టిన తల్లి

కూతురికి వివాహం అయితే తల్లిదండ్రలు ఎంతో సంతోషిస్తారు. కాని అదే కూతురి  భర్త‌తో అక్రమ సంబంధం పెట్టుకొని తల్లి కూతురు కాపురంలో నిప్పులు పోసింది. వివరాల్లోకి వెళ్తే..

ఇంగ్లాండ్ లోని ట్వికెంహం అనే నగరంలో లౌరెన్ వాల్ అనే మహిళ పౌల్ అనే వ్యక్తిని ప్రేమించింది. పౌల్ ద్వారా బిడ్డకు తల్లి అయ్యింది.  అయితే, సమాజంలో బాగుండదు అని చెప్పి ఆమె తల్లి జూలీ, వారిద్దరికి వివాహం జరిపించింది.  పెళ్లయిన తర్వాత వాల్, పౌల్ ఇద్దరు హనీమూన్ కు వెళ్లారు.  వీరికి చిన్నారి ఉండడంతో ఆలనా పాలనా చూసుకుంటుందని చెప్పి తల్లి ని కూడా వారి వెంట తీసుకెళ్లారు.  ఈవిషయమే వారి దాంపత్య జీవితాన్ని మలుపు  తిప్పింది. వాల్ తన కూతురిని తీసుకొని బయటకు వెళ్తుండేది. ఈక్రమంలో అత్తతో అల్లుడు సరసాలు చేసేవాడు.  ఇద్దరి మధ్య అనుబంధం చిగురించి చివరికి అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ వింత సంఘటన తెలిసిన స్థానికులు నవ్వుకుంటున్నారు. 

అయితే భార్యతో కంటే అత్తతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇదే ఆమె పాలిట శాపమైంది.  ఓరోజు వాల్ చెల్లిదగ్గర తల్లి ఫోన్ ను చూసి షాక్ అయ్యింది.  అందులో తన భర్త పౌల్ తో చాటింగ్ చేసిన విషయాలు ఉన్నాయి.  ఇద్దరిని నిలదీసింది.  దీంతో ఆ భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.  కానీ తర్వాత కూడా అత్త జూలీతో విచ్చల విడిగా తిరుగుతూ కనిపించాడు.  ఇంకేముంది. జూలీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి పౌల్ భార్య పాల్ కంగుతిన్నది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published.