తండ్రి పాట‌కి… కూతురు స్టెప్పులు… అదుర్స్!


హీ ఈజ్ సో క్యూట్‌, హీ ఈజ్ సో స్వీట్ అంటూ ఇటీవ‌లె విడుద‌లైన మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలోని పాట‌. మ‌హేష్ కుమార్తె అయిన సితార‌… ఈ పాట‌కు త‌న స్టెప్పుల‌తో అద‌రగొట్టింది. హీరోయిన్ ర‌ష్మికా మండ‌న్నా ఈ పాట‌లో ఎలాగైతే డాన్స్ చేసిందో త‌ను సేమ్ టు సేమ్ అలానే డ్యాన్స్ చేసి సూప‌ర్‌స్టార్ కూతుర‌నిపించుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ చిన్నారి వేసే ముద్దు ముద్దు స్టెప్పుల‌కు నెటిజ‌న్లు పెట్టే కామెంట్లు మాములుగా లేవుగా.

లిటిల్‌ క్వీన్‌ సితార చిన్నతనంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటుంది. తన టాలెంట్‌తో ఇప్పటికే స్టార్‌ అవుతున్న బేబీ సితార డిస్నీ సంస్థ తరఫున తెలుగులో వస్తున్న మూవీ ఫ్రాజెన్‌-2కు  గొంతును అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాహుబలి-2 సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా’..పాటకు స్టెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిన్నారి చిన్న‌ప్ప‌టి నుంచి కూడా చాలా యాక్టివ్‌గా ఉంటది. డ్యాన్స్‌లు, పాట‌లు ఇలా ఇంత చిన్న వ‌య‌సులోనే చాలా టాలెంట్‌ని చూపించ‌గ‌లిగే ఏకైక క్యూట్ స్టార్ అని చెప్పాలి.

ఇక స‌రిలేరు నీకెవ్వ‌రు నుంచి వేసిన ఈ స్టెప్పుల‌కు మ‌హేష్ ఫ్యాన్స్ ఎక్క‌డా ఆగ‌డం లేదు. చిన్నారి స్టెప్పుల‌కు అదుర్స్ అంటూ కామెంట్ల పై కామెంట్లు పెట్టేస్తున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న మహేష్‌కు జోడిగా నటిస్తోంది. దిల్‌ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన మూడు పాటలు సూపర్‌ టాక్‌ సంపాదిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. మ‌రి ఈ చిత్రం ఈ సారి మ‌హేష్ ఫ్యాన్స్ ను ఏమాత్రం అల‌రిస్తుందో వేచి చూడాలి. 


Leave a Reply

Your email address will not be published.