మొక్కలు పర్యావరణానికి ఎంతో కృషి చేస్తాయి…సినీ నటి కౌసల్య

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ప్రతి ఒక్కరూ స్వీకరించి మొక్కలు నాటాలని సినీ నటి కౌసల్య అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కౌసల్య పాల్గొన్నారు. నగరంలోని అమీర్‌పేటలో గల సారథి స్టూడియో ఆవరణలో ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు పర్యావరణానికి ఎంతో కృషి చేస్తాయన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమతుందన్నారు. కార్యక్రమంలో సినీ నటులు కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. యి