ప్ర‌భాస్ ఫ్యాన్స్ అస‌లు ఎక్క‌డా ఆగ‌ట్లేదుగా…?

బాహుబలి చిత్రం తో వ‌ర్ల‌డ్‌వైడ్‌గా స్టార్‌ హీరో అయ్యారు ప్ర‌భాస్. సాహో చిత్రంతో ఈ క్రేజ్ మ‌రింత పెరిగింద‌నే చెప్పాలి. సినిమా ఆశించినంత ఫ‌లితం సాధించ‌క‌పోయిన‌ప్ప‌టికీ బాలీవుడ్‌లో మాత్రం క‌లెక్ష‌న్లకు కొర‌తేమి లేదు. అయితే ప్రభాస్ ప్రస్తుతం జానూ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొదలై ఇన్ని రోజులవుతున్న చిత్ర బృందం ఇప్పటివరకు ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయలేదు.


అలాగే ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ రాకపోవడం తో ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఒక ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. wewantprabhas20update అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో హల్‌చ‌ల్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ సాహో చిత్రానికి ఎంతో దూకుడు ప్రదర్శించారు. చిత్ర టైటిల్ ని ప్రభాస్ ఎలా వుండబోతున్నాడో ముందే ఒక టీజర్ ద్వారా చూపించారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలి నుండి రెండేళ్లకు ఒక సినిమా ని చూస్తున్నారు. ప్రభాస్ మీద ప్రేమతో ఆగినప్పటికీ ప్రస్తుతం ఈ చిత్రానికి అలా అయ్యేలా లేదు అని తెలుస్తుంది. అయితే జనవరి 1, 2020 కి ఫస్ట్ లుక్ ని విడుదల చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇక మ‌రి మ‌న డార్లింగ్ ప్ర‌భాస్ ఏం చేస్తారో చూడాలి. 


నెవర్ బిఫోర్ అనే విధంగా ఒక లుక్ తో అభిమానులకు సరికొత్త కిక్ ఇవ్వాలని కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. మ‌రి ఈ కొత్త లుక్ ప్ర‌భాస్ అభిమానుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.ఇక‌పోతే ప్ర‌భాస్ స‌ర‌స‌న హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టించ‌గా మ‌రో బాలీవుడ్ భామ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. దర్శకుడి ఆలోచన ప్రకారం ప్రభాస్ బరువు తగ్గేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. డబ్బుకు వెనకాడేదే లేదని, వేసే ప్రతి సెట్ కూడా అద్భుతంగా ఉండాలని నిర్మాతలు చెప్పేశారట.

Leave a Reply

Your email address will not be published.