అప్పుడు నో ఇప్పుడు ఎస్‌

2016 – 2017లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంత బిజీగా ఉందంటే మహేష్‌బాబు మూవీకి కూడా నో చెప్పినంత బిజీ. కాని రకుల్‌ ప్రభావం ఆ రెండేళ్లు మాత్రమే అయ్యింది. ఆ తర్వాత నుండి ఆమె క్రేజ్‌ మెల్ల మెల్లగా తగ్గింది. 2017వ సంవత్సరంలో బాలకృష్ణతో ఒక మూవీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కాని అప్పుడు రకుల్‌ అబ్బే మరీ అంత సీనియర్‌ హీరోతో నేను సెట్‌ అవ్వను, నేను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను, డేట్లు లేవు అంటూ సిల్లీ రీజన్స్‌ చెప్పిందట. కట్‌ చేస్తే ఇప్పుడు బాలయ్యకు జోడీగా ఆమె ఎంపిక అయ్యింది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూవీలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంపిక అయ్యింది. అందుకు సంబంధించిన ఒప్పందం కూడా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. తెలుగులో రకుల్‌ ఈమద్య కాలంలో ‘కథానాయకుడు’ చిత్రంలో నటించింది తప్ప మరే సినిమాకు కమిట్‌ కాలేదు. కమిట్‌ అవ్వడానికి ఆమె వద్దకు అసలు ఆఫర్‌లు రాలేదు. దాంతో రకుల్‌ వెంటనే బాలయ్య మూవీకి ఓకే చెప్పింది. తమిళంలో మూడు నాలుగు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే తెలుగులో బాలయ్య మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట.

గతంలో బాలయ్యకు నో చెప్పిన ఈ అమ్మడిని మళ్లీ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అంటూ బోయపాటిపై నందమూరి అభిమానులు సీరియస్‌ అవుతున్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రంలో శ్రీదేవిగా నటించి మెప్పించింది కనుకే బాలయ్య ఈమెకు తన తర్వాత సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్రను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం విడుదలైన తర్వాత బోయపాటి మూవీలో బాలకృష్ణ నటించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published.