గోడ మీద వార్తలు

గోడ మీద వార్తలు                                 11 – 01 – 2019

01 రాష్ట్రానికెన్నో ప్రైవేటు యూనివర్సిటీలు వస్తున్నాయ్ – వాటితో ప్రభుత్వ యూనివర్సిటీలు పోటీ పడి ఎదగాలి – మంత్రి గంటా …

సర్లే గానీ –  ఇంతకీ ఆ ప్రైవేటు సర్టిఫికేట్లన్నీ పని కొస్తాయా లేక ఓ పదేళ్ళు నిద్దరోయాక లేచి ముఖం కడుక్కుని నాలిక్కరుచుకుంటారా సామీ…??

02. జగన్ అన్ని యాత్రలూ చేసేసాడు – చివరికి అతనికి కాశీ యాత్రొకటే మిగిలింది – మంత్రి దేవినేని …

మీ సెటైరు స్వీడనెళ్ళ – పట్టిసీమ పుణ్యమాని గోదారి నీరు బాగా ఒంటబట్టినట్టుందే –  ఐనా కాశీయాత్రకి పోతే బెల్లమ్ముక్కెట్టి బతిమాలడానికి ఆయన ఏమన్నా బెమ్మచారా..?? ఏకపత్నీవ్రతుడైన భారతీపతి గానీ ..!!

03. ఏపీ భాజపాని ఒక్కొక్కరిగా వీడిపోతున్న నేతలు – పురంధరేశ్వరి వైకాపా – మిగిలిన వారు తెదేపా జనసేనల్లో సర్దుకుంటాలని వార్తలు …

ఉన్న పుంజిడు మందీ వీడిపోయినా సరే – ఈర్రాజు మాయ్యొక్కడుంటే చాలు – జనరిక్ స్టోర్ లో బీపీ బిల్లలు అమ్ముడుపోడానికి…!!

04. పాదయత్రలన్నీ పూర్తవటంతో కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న – జగన్ …

హేవిఁటో – నాస్తిక సభలని కొబ్బరికాయ కొట్టి ఆరంభించినంత చిత్రంగా ఉంది యవ్వారం…!!

05. సుప్రీం కోర్టు వరమిచ్చిన 24 గంటలు గడవక ముందే సీబీఐ డైరక్టరు అలోక్ వర్మని పదవి నుండి పీకేసిన – హై పవర్ కమిటీ ..

యవ్వారం సూత్తంటే భక్తాయిలకి కూడా మింగుడు పడని బ్రహ్మపదార్ధమేదో వండి వార్చి అస్మదియులకి ఆకుల్లో వడ్డిస్తన్నట్టే ఉంది …!!

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!

“ 

Leave a Reply

Your email address will not be published.