గోడ మీద వార్తలుగోడ మీద వార్తలు                                              

01 . కరోనా విస్తరిస్తోందన్న వార్తల నేపథ్యంలో కోర్టుకి తమ క్లయింట్లని తీసుకురావొద్దని లాయర్లని ఆదేశించిన – తెలంగాణ హైకోర్టు …

హమ్మయ్య – ఈ వారం ఎగ్గొట్టేందుకు సాకులు ఎతుక్కోనవసరం లేదన్న మాట – ఓ అరవై మిగులు …!!

02. కేసీఆర్ ఫాం హౌస్ పై డ్రోన్లు ఎగరేసారంటూ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన – అధికారులు …

జనం మర్చిపోతున్నోడికి పనిగట్టుకు ప్రచారం చేయటం ఏందిరా సామీ – ఇంకానయం – పతంగులెగరేసాడని పట్టుకుపోయారు కాదు –  ..!!

03. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ దేశ క్షేమం కోసం ఒక్కో మహిళా ఆరుగురుని కనాలని సూచించిన – వెనుజులా అద్యక్షుడు …

తనది కాపోతే కాశీ వరకూ డేకరమన్నాడనీ – నీదేం పోయింది సామీ – పురిటినొప్పులు నీవి కావుగా …!!

04. యస్ బ్యాంకు వినియోగదారులు తమ ఖాతాల నుండి కేవలం 50 వేలు మాత్రమే విత్ డ్రా చేస్కోవాలని రూల్ పెట్టీన – ఆర్బీఐ …

ఇంకానయం – జనాన్ని బ్యాంకుల్లో డబ్బులు దాస్కున్న సంగతి మర్చిపొమ్మనలేదు …!!

05 . నీటి సమస్యపై కేసీఆర్ ని కలిసిన తమిళనాడు మంత్రులు – జగన్ కి ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరిన – కేసీఆర్ …

ఏటో – సీను మొత్తం తెలుగోడు అరఁవ అమ్మాయిని చేస్కుఉఅంటే పుట్టిన మళయాల పోడు కన్నడం మాటాడినంత కన్ఫ్యూజనుగా ఉంది – ఇంతకీ ఏపీ సీయం ఎవరు…?? 

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 

“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 

Leave a Reply

Your email address will not be published.