ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు


  రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు (420 కేసు) నమోదైంది.  ఇందుకు ప్ర‌ధాన కార‌ణం  బీహార్‌ కీ బాత్ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న గ‌త వారం ఆరంభించ‌డ‌మే. ఇదేంటి రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోవ‌టం ఈ వ్యూహ‌క‌ర్త హ‌క్క‌ని చెపుతున్నాపోలీసులు మాత్రం కుద‌ర‌దంటూ కేసు పెట్టారు. 

ప్ర‌ధాని మోడీ నిర్వ‌హిస్తున్న మాన్ కీ బాత్ త‌ర‌హాలో త‌ను బీహార్ కీ బాత్ అనే కార్య‌క్ర‌మాన్ని  జ‌న‌వ‌రి నుంచే నిర్వ‌హిస్తున్నాన‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని, సంబంధిత కార్యాల‌యాల‌లో వాటి ప‌రిష్కారాల‌కోసం కృషి చేస్తున్నాన‌ని బీహార్‌లోని మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు తెలియ‌చేస్తూ, త‌న కార్య‌క్ర‌మాన్ని ప్ర‌శాంత్ కిషోర్ కాపీ కొట్టాడ‌ని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ నేప‌థ్యంలో కేసు న‌మోదు చేసిన పోలీసులు  విచారణ ప్రారంభించి  కిషోర్‌పై   ప్రశాంత్‌ కిషోర్‌పై 420, 406 సెక్షన్ల కింద   కేసు పెట్టారు. 
బీహార్‌కు కొత్త నేత అవ‌స‌రం అన్న ల‌క్ష్యంతో బాత్‌ బీహార్‌ కీ ఉద్య‌మం చేప‌ట్టిన ప్రశాంత్ కిషోర్  కేంద్రం ప్ర‌క‌టించిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, జాతీయ పౌర ప‌ట్టిక(ఎన్ఆర్సీ)కి వ్య‌తిరేకంగా ప్రచారం నిర్వహిస్తానని  ప్రకటించిన సంగతి తెలిసిందే.  చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  రానున్న వంద రోజుల్లో కోటి మంది యువ‌త‌ను త‌మ ఉద్య‌మంలో భాగం చేస్తామ‌ని ప్రకటించిన నేప‌థ్యంలో ఇలా కేసులు పెట్ట‌డం రాజ‌కీయ క‌క్ష సాధింపులో భాగ‌మేన‌ని ప్ర‌శాంత్ కిషోర్ అభిమానులు చెపుతున్నారు.
 

Leave a Reply

Your email address will not be published.